సమిష్టిగా పోరాడుదాం.. డ్రగ్స్ ఫ్రీ సొసైటీని సాధిద్దాం
సమిష్టిగా పోరాడుదాం.. డ్రగ్స్ ఫ్రీ సొసైటీని సాధిద్దాం!*
హైదరాబాద్:** డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సమిష్టిగా ముందుకు రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.హైదరాబాద్ కావాడిగూడలోని CGO టవర్స్‌లో నషా ముక్త్ భారత్ పాదయాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. బీజేపీ సీనియర్ మహిళా నాయకురాలు బంగారు శృతి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సమావేశంలో బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, నాన్ తెలుగు కమ్యూనిటీస్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు జూటూరు కీర్తిరెడ్డితో పాటు హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని గుజరాతీ, మరాఠీ, సిక్కు, మార్వాడీ తదితర నాన్ తెలుగు కమ్యూనిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.డ్రగ్స్ వ్యసనానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడం, యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచడం వంటి అంశాలపై చర్చించారు. ఈ నెల 22న వివిధ కమ్యూనిటీల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.