తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌గా మహేష్ భగవత్... సజ్జనార్‌కు మరో కీలక బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 21 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 12, 2026న జారీ చేసిన జీవో నంబర్ 1654 ద్వారా ఈ బదిలీలను ప్రకటించింది. ఈ మార్పుల్లో భాగంగా హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ మురళీధర్ భగవత్ నియమితులయ్యార

13 Nov, 26
 0  15

తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలుహైదరాబాద్ పోలీస్ కమీషనర్‌గా మహేష్ భగవత్... సజ్జనార్‌కు మరో కీలక బాధ్యత

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 21 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.నవంబర్ 12, 2026న జారీ చేసిన జీవో నంబర్ 1654 ద్వారా ఈ బదిలీలను ప్రకటించింది. ఈ మార్పుల్లో భాగంగా హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ మురళీధర్ భగవత్ నియమితులయ్యారు. ఇప్పటివరకు హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌గా కొనసాగిన వీసీ సజ్జనార్‌ను తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం డీజీగా బదిలీ చేశారు. అదనంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ బాధ్యతలను కూడా ఆయన నిర్వహించనున్నారు.

మరోవైపు డాక్టర్ సౌమ్య మిశ్రాను మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా విభాగాల డీజీపీగా నియమించగా, స్వాతి లక్రాకు జైళ్ల శాఖ డీజీపీ బాధ్యతలు అప్పగించారు.


ఇతర కీలక నియామకాలు:


- చారు సిన్హా – అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీ.

- డాక్టర్ అనిల్ కుమార్ – టీజీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్.

- వై. నాగిరెడ్డి – పౌర సరఫరాల కమిషనర్.

- విక్రమ్ సింగ్ మాన్ – గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ డీజీ.

- ఎం. స్టీఫెన్ రవీంద్ర – తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్.

- అకున్ సబర్వాల్ – అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్).

- సంజయ్ కుమార్ జైన్ – అదనపు డీజీపీ (ట్రైనింగ్) పూర్తి అదనపు బాధ్యతలు.

- ఎస్. చంద్రశేఖర్ రెడ్డి – ఏసీబీ డైరెక్టర్.

- కార్తికేయ – మల్టీ జోన్-1 ఐజీపీ.

- కె. రమేష్ నాయుడు – రైల్వే ఐజీపీ.

- డి. జోయల్ డేవిస్ – రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ విభాగాల జాయింట్ డైరెక్టర్.

- ఎల్.ఎస్. చౌహాన్ – కోఆర్డినేషన్ డీఐజీ.

- జి. చందన దీప్తి – జోగులాంబ జోన్-7 డీఐజీ పూర్తి అదనపు బాధ్యతలు.

- ఆర్. భాస్కరన్ – ఇంటెలిజెన్స్ డీఐజీ.

- కె. నారాయణ నాయక్ – బాసర జోన్-2 డీఐజీ. శ్రీ బాలాదేవి – టీజీ-టీఎంఏఆర్ఎస్ డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్). వి. అరవింద బాబు – హైదరాబాద్ సిటీ డీసీపీ (ఎస్‌ఎం అండ్ ఐటీ).మొత్తంగా రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక మార్పులు చేపట్టిన ప్రభుత్వం.. శాంతిభద్రతలు, మహిళా భద్రత, అవినీతి నిరోధక చర్యలు, ట్రాఫిక్ నిర్వహణతో పాటు పలు కీలక విభాగాలకు కొత్త బాధ్యతలను అప్పగించింది.