సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సంబరాలు..

08 Nov, 26
 0  4
సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సంబరాలు..
సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సంబరాలు..

???? సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేక్ కటింగ్, దుప్పట్ల పంపిణీ!

బోరబండ, రహమత్ నగర్‌తో పాటు పలు డివిజన్లలో వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్!

జూబ్లీహిల్స్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని బోరబండ, రహమత్ నగర్‌తో పాటు పలు డివిజన్లలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించి, పేదలు, నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టడం విశేషం.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, భవాని శంకర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.