సేవాలాల్ మహారాజ్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
సేవాలాల్ మహారాజ్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి.. మైపాటి అరుణ్ కుమార్‌కు ఎస్టీ నాయకుడు నందు నాయక్ హెచ్చరిక!
హైదరాబాద్ 12 నవంబర్
సేవాలాల్ మహారాజ్‌పై మైపాటి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నందు నాయక్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నందు నాయక్ మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్‌ను గౌరవించే గిరిజన సమాజం మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. లేనిపక్షంలో గిరిజన సమాజం తరఫున ఆందోళన చేపడతామని తెలిపారు.