మహిళలపై దాడి చేసిన వారి మీద కేసు నమోదు

11 Nov, 26
 0  2
మహిళలపై దాడి చేసిన వారి మీద కేసు నమోదు


ఆస్తి వివాదం.. మహిళలపై దాడి చేసినట్లు ఆరోపణలు! ప్రాణహాని ఉందంటూ బాధితుల ఆవేదన

హైదరాబాద్:10 నవంబర్ (సత్యమేవ జయతే) జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంకటగిరిలోని పీజేఆర్ కమ్యూనిటీ హాల్ సమీపంలో ఉన్న ఇంటి ఆస్తి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది.బాధితుల కథనం ప్రకారం.. పెద్దల సమక్షంలో ఆస్తి పంపకాలపై ఒప్పందం జరిగినప్పటికీ, కొడుకులకు ఇచ్చిన ఆస్తిని తండ్రి రహస్యంగా కూతురు పేరు మీద మార్చినట్లు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎం. సరిత, ఎం. నిర్మలపై మేకల విట్టల్ దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ ఘటనపై బాధితులు అక్టోబర్ 29, గురువారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి, దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మేకల విట్టల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించినట్లు బాధితులు వెల్లడించారు.

తమపై ఇప్పటికే మూడుసార్లు దాడి జరిగిందని, మేకల విట్టల్ నుంచి తమకు ప్రాణహాని ఉందని, చంపేస్తామని బెదిరిస్తున్నారని ఎం. సరిత, ఎం. నిర్మల ఆవేదన వ్యక్తం చేశారు

తమకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు.