స్మశాన కొరకు కలెక్టర్ కార్యాలయం లో ముట్టడి

10 Nov, 26
 0  2
స్మశాన కొరకు కలెక్టర్ కార్యాలయం లో ముట్టడి
స్మశాన కొరకు కలెక్టర్ కార్యాలయం లో ముట్టడి

 బోరబండ పిలి దర్గా సమీపంలోని స్మశాన వాటిక భూమిని తమకు అప్పగించాలని కలెక్టర్‌కు ఫిర్యాదు!

కోర్టు కేసుతో నిలిచిపోయిన పనులు.. ప్రజావాణిలో బాధితుల విజ్ఞప్తి!

బోరబండ పిలి దర్గా సమీపంలో ఉన్న భూమిని స్మశాన వాటిక కోసం కేటాయించినట్లు స్థానికులు తెలిపారు. సదరు భూమిని శుభ్రం చేసే సమయంలో కొందరు స్థానికులు కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు.కలెక్టర్ ఆదేశాల మేరకు డిసెంబర్ 31వ తేదీన స్మశాన వాటిక కోసం స్థలాన్ని అప్పగించే ప్రక్రియ జరిగిందని స్థానికులు వెల్లడించారు. అయితే కోర్టులో కేసు వేయడంతో ప్రస్తుతం స్మశాన వాటిక అభివృద్ధి పనులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో నవంబర్ 9వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు అందజేశారు. స్మశాన వాటికకు కేటాయించిన భూమిని తమకు అప్పగించి, అవసరమైన పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ను కోరారు.