బోరబండ వినాయకరావు నగర్లో అక్రమ నిర్మాణాల జోరు.. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం
బోరబండ వినాయకరావు నగర్లో అక్రమ నిర్మాణాల జోరు.. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం!
హైదరాబాద్: బోరబండ వినాయకరావు నగర్ పరిధిలో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని స్థానిక నివాసితులు ఆరోపిస్తున్నారు.5 అంతస్తులు కేవలం100 గజాల స్థలంలో భవనం, 60 గజాల స్థలంలో నాలుగు అంతస్తుల భవన నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. నాయకుల అండదండలకు నిర్మాణం చేయడం జరుగుతుందని ఆరోపించారు..
అనుమతులు లేని నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గచ్చిబౌలిలో 60 గజాల స్థలంలో నిర్మించిన భవనం కూలిన నేపథ్యంలో, వినాయకరావు నగర్లోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.