బోరబండ లో అక్రమ నిర్మాణాల జోరు

10 Nov, 26
 0  2
బోరబండ లో అక్రమ నిర్మాణాల జోరు
బోరబండ లో అక్రమ నిర్మాణాల జోరు

బొరబండ వినాయకరావు నగర్‌లో అక్రమ నిర్మాణాల జోరు!

75 గజాల్లో ఐదంతస్తులు.. 60 గజాల్లో నాలుగు అంతస్తులు.. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం!హైదరాబాద్: బొరబండ వినాయకరావు నగర్ పరిధిలో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని స్థానిక నివాసితులు ఆరోపిస్తున్నారు. కేవలం 75 గజాల స్థలంలో ఐదంతస్తుల భవనం, 60 గజాల స్థలంలో నాలుగు అంతస్తుల భవన నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు.అనుమతులు లేని నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గచ్చిబౌలిలో 60 గజాల స్థలంలో నిర్మించిన భవనం కూలిన ఘటన నేపథ్యంలో, వినాయకరావు నగర్‌లోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకముందే జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తక్షణమే స్పందించి నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని, అనుమతులు పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.