నాయకుల అండదండలతోనే నిర్మాణం
???? గాయత్రీ నగర్లో బిల్డర్ ఇష్టారాజ్యం? రాళ్లు పగులగొడుతూ నివాసితుల్లో భయాందోళనలు!
ప్రశ్నించిన వారిపై బెదిరింపుల ఆరోపణలు.. రాజకీయ అండదండలతో అక్రమ నిర్మాణాలా? అధికారుల విచారణకు స్థానికుల డిమాండ్!కూకట్ పల్లి..గాయత్రీ నగర్గాయత్రీ నగర్ పరిధిలో ఓ బిల్డర్ వ్యవహారం స్థానిక నివాసితుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. గుట్టలతో కూడిన భూమిని తీసుకుని భారీ రాళ్లను పగులగొడుతున్నారని, ఈ పనుల కారణంగా సమీప ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు..రాళ్లు పగులగొట్టే పనులపై ప్రశ్నించిన నివాసితులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఈ పనులకు సంబంధిత శాఖల అనుమతులు ఉన్నాయా? భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? ఈ వ్యవహారం వెనుక ఎవరెవరి అండదండలు ఉన్నాయనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.మరోవైపు, కొందరు బిల్డర్లు రాజకీయ నాయకులతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుంటూ, వారి ఫొటోలను అడ్డుపెట్టుకుని అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.
గాయత్రీ నగర్లో సగం ప్రాంతం తమ ఆధీనంలో ఉన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారనే విమర్శలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
అధికారులు స్పందించాలి!జీహెచ్ఎంసీ, రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి భూమి యాజమాన్యం, రాళ్లు పగులగొట్టేందుకు ఉన్న అనుమతులు, నిర్మాణాల చట్టబద్ధత, ప్రజల భద్రతపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు
ప్రజల ప్రాణాలకు, నివాస భద్రతకు ముప్పు కలిగించే చర్యలు ఉంటే తక్షణమే అడ్డుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.