సెంట్రింగ్ యూనియన్ సభ్యులకు మిఠాయిల పంపిణీ

09 Nov, 26
 0  3
సెంట్రింగ్ యూనియన్ సభ్యులకు మిఠాయిల పంపిణీ
సెంట్రింగ్ యూనియన్ సభ్యులకు మిఠాయిల పంపిణీ

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ హెచ్‌ఎఫ్ నగర్ కార్యాలయంలో దీపావళి పండుగను పురస్కరించుకుని యూనియన్ సభ్యులకు మిఠాయి బాక్సులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని హెచ్‌ఎఫ్ నగర్ అధ్యక్షుడు మొహమ్మద్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా మొహమ్మద్ అహ్మద్ మాట్లాడుతూ.. సెంట్రింగ్ యూనియన్ సభ్యుల సౌకర్యార్థం ప్రత్యేక కార్యాలయం కేటాయించాలని కోరుతూ స్థానిక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు గతంలో వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు దీనిపై స్పందన రాలేదని పేర్కొన్నారు.

యూనియన్ సభ్యులందరూ సమావేశాలు నిర్వహించుకోవడానికి, తమ సమస్యలను చర్చించుకోవడానికి ప్రత్యేక కార్యాలయం అవసరమని తెలిపారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ స్పందించి యూనియన్‌కు కార్యాలయం కేటాయించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో హెచ్‌ఎఫ్ నగర్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అహ్మద్..

, చైర్మన్ యాదగిరి, సయ్యద్ ఫరూక్, ముజీబ్, టైషన్ శ్రీను, శివాజీ, రమేష్ నాయక్, సంగమేష్, బాలు, శంకర్, భరత్, రవి, సమీర్ తదితర యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.