ఖైరతాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన సంబరాలు.
మీరు చూస్తున్నారు.JTV EXPRESS NEWS
???? సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు!
ఖైరతాబాద్ హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో ఘనంగా వేడుకలు.. మహిళలకు చీరలు, విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్ నేతృత్వంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ పాల్గొన్నారు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం మహిళలకు చీరలు, విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ మేయర్లు బొంతు రామ్మోహన్, గద్వాల విజయలక్ష్మి, హనుమంతరావు, ఫహీమ్ ఖురేషి, కోట నీలిమ, దీపక్ జాన్, షబ్బీర్ అలీ, దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.