జీడిమెట్లలో ఫాక్స్ సాగర్‌కు మహర్దశ.. మినీ రిజర్వాయర్‌గా అభివృద్ధి!
హైదరాబాద్: జీడిమెట్లలోని చారిత్రక ఫాక్స్ సాగర్ చెరువుకు మహర్దశ పట్టనుంది. చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రారంభించారు. చెరువులోని ఆక్రమణలను తొలగించడంతో పాటు, 5 మీటర్ల లోతు వరకు పూడికతీత పనులు చేపట్టనున్నారు.ప్రస్తుతం చెరువు నీటి నిల్వ సామర్థ్యం 1,000 మిలియన్ లీటర్లు ఉండగా, పునరుద్ధరణ పనుల ద్వారా 4,000 మిలియన్ లీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు చెరువులో కలవకుండా ఎస్టీపీ (మురుగునీటి శుద్ధి కేంద్రం) ఏర్పాటు చేయనున్నారు.
అలాగే పురాతన రాతి పంప్‌హౌస్‌ను పునరుద్ధరించడంతో పాటు, చెరువు చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మించనున్నారు. ఏడాదిలోపు ఫాక్స్ సాగర్‌ను మినీ రిజర్వాయర్‌గా, మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలని హైడ్రా లక్ష్యంగా పెట్టుకుంది.