Date : 13 November 2026
Posted By : JTV EXPRESS

ఇందిర‌మ్మ ఇల్లు పొందిన ఆడ‌బిడ్డ‌ల ఆనంద‌మే మాకు ఆశీస్సులు

ఇందిర‌మ్మ ఇల్లు పొందిన ఆడ‌బిడ్డ‌ల ఆనంద‌మే మాకు ఆశీస్సులు

ఇందిర‌మ్మ ఇల్లు పొందిన ఆడ‌బిడ్డ‌ల ఆనంద‌మే మాకు ఆశీస్సులు

 రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్ పల్లి మరియు రాజేంద్రనగర్ మండలం మైలార్‌దేవపల్లిలో సహచర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు Duddilla Sridhar Babu గారు , ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖా ఉన్నతాధికారులు,  లబ్దిదారులతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది.అదే వేదికగా ఆన్లైన్ లో ఈ - లాటరీ ద్వారా లబ్ధిదారులకు ఏబ్లాక్ లో ఏప్లాట్ వచ్చిందో తెలియజేసీ, ఇళ్ల పట్టాల మంజూరు పత్రాలను అందించడం జరిగింది.రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు ఓ నిరంత‌ర ప్ర‌క్రియ‌గా సాగుతుంది. గ‌త బిఆర్ఎస్ ప్ర‌భుత్వం ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేసి నెత్తిన పెట్టి పోయినా, ఎల్ నినో వంటి ప్ర‌కృతి విప‌త్తులు వ‌చ్చినా ఈ ప‌థకం ఆగ‌దు. నిరుపేద‌ల ఆత్మ‌గౌర‌వ‌మే ఆలంబ‌న‌గా క్యూర్ ప‌రిధిలోని కోట్లాది రూపాయల విలువ‌చేసే ప్రాంతాల్లో శంకుస్ధాప‌న‌లు పూర్తిచేసుకున్న ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నిర్మాణాల‌ను వ‌చ్చే దీపావ‌ళిక‌ల్లా పూర్తి  చేస్తాం. గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారి నాయ‌క‌త్వంలో ల‌బ్దిదారులు  ఆ ఇళ్ల‌లో దీపావ‌ళి జ‌రుపుకోవాల‌న్న‌ ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నాం. పేదల జీవితాశ‌య‌మైన సొంత ఇంటి కలను ప్ర‌భుత్వం నెరవేరుస్తుంది. క్యూర్ పరిధిలో మ‌రో మూడు విడ‌త‌లు కూడా ఇళ్లు మంజూరు చేస్తాం.క్యూర్ ప‌రిధిలోని 23 నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఇందిర‌మ్మ ఇళ్ల కేటాయింపు పార‌ద‌ర్శ‌కంగా, కుల‌మతాలు, పార్టీల బేధాలు లేకుండా కేటాయింపు జ‌రుగుతోంది. ఇళ్లు పొందిన ల‌బ్దిదారులు కంట ఆనంద‌బాష్పాలు చూస్తుంటే ఈ ప్ర‌భుత్వానికి, త‌మ‌కు ఇంత‌కంటే ఇంకేం కావాల‌నిపిస్తుంది. వారి స్పంద‌న చూస్తే  క‌ళ్లు చెమ‌రుస్తున్నాయి. వారి ఆనంద‌భాష్పాలే ప్రజాప్రభుత్వానికి ఆశీస్సులు. 


#IndirammaIndluTowers #IndirammaIndlu #hyderabad

Telangana CMO Anumula Revanth Reddy