పరిహారం చెల్లించకుండా ఇళ్ల కూల్చివేతలు ఆపాలి*_ !
మూసాపేట్ జోన్, అల్లాపూర్ డివిజన్ పరిధిలోని డీ-బ్లాక్ సఫ్దర్ నగర్లో ఎలాంటి న్యాయం చేయకుండా, పరిహారం చెక్కులు అందించకుండానే ఇళ్లను కూల్చివేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కూల్చివేత పనులను వెంటనే నిలిపివేయాలని అధికారులను కోరారు. ఇప్పటికే 16 మంది ఇంటి యజమానులకు ఇచ్చిన పరిహారం చెక్కులను తిరిగి ఇవ్వాలని మున్సిపల్ అధికారులు కోరుతున్నారని బండి రమేష్ గారు తెలిపారు.
ఇంకా పరిహారం అందని మిగిలిన 35 మంది ఇళ్ల యజమానులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం భూమికి సరైన పరిహారం నిర్ణయించి, మొత్తం 51 మంది ఇంటి యజమానులకు సంబంధించిన పరిహారం చెక్కులను ఒకేసారి, ఒకే వేదికపై అందించాలని కోరారు.పరిహారం అందరికీ సమానంగా చెల్లించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని బండి రమేష్ డిమాండ్ చేశారు.