Date : 11 November 2026
Posted By : JTV EXPRESS

???? బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి ఆత్మహత్య

బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మధురానగర్‌లోని ఎస్.ఆర్.టి. నగర్‌లో నివాసం ఉంటున్న సాయిరాం (32) అనే వ్యక్తి బుధవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మృతుడు ఫుడ్ బిజినెస్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంతకాలంగా మానసిక ఆవేదనకు గురవుతున్నాడని, ఈ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.సమాచారం అందుకున్న బోరబండ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి, మృతికి గల కారణాలపై తదుపరి దర్యాప్తు చేపట్టారు.