ప్రజా ప్రభుత్వంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట – మంత్రి సీతక్క!
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది!
హైదరాబాద్: తెలంగాణ ప్రజా ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యతనిస్తూ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి దనసరి సీతక్క పేర్కొన్నారు..మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో పాటు ఇందిరమ్మ చీరలు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు.ఇప్పటివరకు మహిళా సంఘాలకు రూ.79 వేల కోట్ల రుణాలు, 6.48 లక్షల వ్యాపార రుణాలు, 4.5 లక్షల కొత్త పెన్షన్లు అందించినట్లు పేర్కొన్నారు.
మహిళల అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను కొనసాగిస్తోందని మంత్రి వివరించారు.
JTV EXPRESS NEWS