JTV EXPRESS NEWS
లంగర్ హౌస్ దర్గాలో చాదర్ సమర్పించిన బాబా ఉద్దీన్
సీఎం రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు.. నిరుపేదలకు , బెడ్షీట్ల పంపిణీ!.
హైదరాబాద్:8 నవంబర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా లంగర్ హౌస్‌లోని సయ్యద్ మీరాన్ హుస్సేనీ బాగ్దాది దర్గాలో ప్రత్యేక చాదర్ సమర్పించి, సీఎం రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
అనంతరం వందలాది మంది నిరుపేదలకు బెడ్షీట్లు, పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం రాష్ట్ర ప్రజలందరికీ సంతోషకరమైన పండుగ అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.