Date : 08 November 2026
Posted By : JTV EXPRESS

సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సంబరాలు యాదాద్రి

సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సంబరాలు యాదాద్రి

దొరల గడీల పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిపించిన, ప్రజా నాయకుడు సీఎం రేవంత్‌రెడ్డి గారి జన్మదిన వేడుకలు:కాసుల మహేష్ గౌడ్.యాదాద్రి భువనగిరి జిల్లా,వలిగొండ: మండల కేంద్రంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని సహాదేవ్ గౌడ్ , పట్టణ అధ్యక్షుడు పోలేపాక జానకిరాములు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు.రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసుల మహేష్ గౌడ్, పాశం సత్తి రెడ్డి, చెరుకు శివయ్య, పాలకూర వెంకటేష్,రవి, రత్నయ్య,కాసుల వెంకన్న, మాద శంకర్ తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కాసుల మహేష్ మీడియా తో మాట్లాడుతూ..చదివిన నేల, పుట్టిన గడ్డ పై నేడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపకోవడం చాలా ఆనందం గా ఉంది.. దొరల గడీల పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించి, ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రజలే కేంద్రంగా ప్రజాసేవకు పెద్దపీట వేస్తున్న ప్రజా నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

ప్రజల ఆశయాలే లక్ష్యంగా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు చేపడుతున్న ప్రతి అడుగు విజయవంతం కావాలని, ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.మీ నాయకత్వంలో ప్రజా పాలన మరింత విజయవంతం కావాలి.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు,వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.